09-11-2025 06:41:55 PM
నియామకం పట్ల భద్రాద్రిలో హర్షం..
భద్రాచలం (విజయక్రాంతి): ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ సంఘ మాస పత్రిక సబ్ ఎడిటర్ గా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.వి రమణ నియామకం పట్ల భద్రాచలం పి ఆర్ టి యు సంఘ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 27 సంవత్సరాలుగా సంఘానికి చేస్తున్న అవిరళ కృషికి తగిన గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ధనికొండ శ్రీనివాస రావు, దశమిబాబు, సురేష్ బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు నరసయ్య, ప్రభాకర్ మండల నాయకులు బి. కృష్ణ, రామకృష్ణ, దగ్గుబల్లి శ్రీను తదితరులు హర్షం వ్యక్తం చేశారు.