28 March, 2026 | 7:44 PM

ఒక్క ఓటరు లేకున్నా ఎస్టీకి రిజర్వ్

01-12-2025 12:44 AM

విస్తుపోతున్న ఓటర్లు 

ఎన్నికల బహిష్కరణకు భద్రాద్రి జిల్లా పాండురంగాపురం వాసుల నిర్ణయం

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 30 (విజయక్రాంతి): ఎస్టీ ఓటర్లు లేని పంచాయతీలో ఎస్టీ రిజర్వేషన్ కల్పించడంపై ఓటర్లు భగ్గుమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామంలో రెండో విడతలో జరగను న్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్ననట్టు గ్రామస్తులు నిర్ణయించారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఎస్టీలు లేని గ్రామం లో ఎస్టీ రిజర్వేషన్లు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఎనిమిది వార్డులకుగాను నాలుగు వార్డులు ఎస్టీ, నాలుగు వార్డులు జనరల్, సర్పంచ్ ఎస్టీ మహిళకు అధికారులు రిజర్వు చేశారు. ఎస్టీలు లేని తమ గ్రా మంలో ఎస్టీలకు రిజర్వు ఎలా కేటాయిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తూ ఎన్నికలకు దూ రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.