28 March, 2026 | 5:42 PM

Breaking News

ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •  

ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పనిసరి

01-12-2025 12:45 AM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, నవంబర్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పనిసరిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో గాలిపూర్ వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి దేవారం శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు నిస్వార్ధంగా పనిచేసినప్పుడు తగిన పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు.

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రభుత్వ పనులు చేపట్టి మంచి పేరును సంపాదించుకోవడం ప్రభుత్వ ఉద్యోగుల ధర్మమని అన్నారు. బంధుమిత్రులు, తన సహోద్యోగులు, అభిమానుల సమక్షంలో వైభవంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్  కాసుల బాలరాజు , పోచారం శంభు రెడ్డి , మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,  బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై దేవారం శ్రీనివాస్ రెడ్డి దంపతులను పూలమాల, నూతన వస్త్రాలు, శాలువ, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం లోని మండలాల ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.