17-01-2026 07:09:24 PM
వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇవే
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. అధికారులు ప్రకటించిన ప్రకారం 15 వార్డులకు గాను రిజర్వేషన్లు వార్డుల వారిగా ఈ విధంగా ఉన్నాయి. సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ రిజర్వేషన్ అయింది.
వార్డుల వారిగా రిజర్వేషన్లు...
1వ వార్డ్ (బిసి మహిళా), 2వ వార్డ్ (జనరల్), 3వ వార్డ్ (జనరల్ మహిళా), 4వ వార్డ్ (జనరల్), 5వ వార్డ్ (బిసి మహిళా), 6వ వార్డ్ (జనరల్), 7వ వార్డ్ (ఎస్సి జనరల్), 8వ వార్డ్ (ఎస్టీ జనరల్), 9వ వార్డ్ (జనరల్), 10వ వార్డ్ (బిసి జనరల్), 11వ వార్డ్ (ఎస్సి మహిళా), 12వ వార్డ్ (జనరల్ మహిళా), 13వ వార్డ్ (బిసి జనరల్), 14వ వార్డ్ (జనరల్ మహిళా), 15వ వార్డ్ (జనరల్ మహిళా) రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీ చేయనున్న అభ్యర్థులు ఇప్పటినుండే ఓటర్లను కలుస్తూ అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తామంటూ వేడుకుంటున్నారు...