calender_icon.png 17 January, 2026 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ముఖాల్లో చిరునవ్వులు

17-01-2026 07:05:29 PM

సంక్షేమానికి సర్కార్ పెద్దపీట

-కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడి

బూర్గంపాడు,(విజయక్రాంతి): రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బూర్గంపాడు మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు లబ్ధిదారులకు 27కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన చెక్కులతో పాటు, అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన వారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్వయంగా అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహం ఆర్థికంగా భారంగా మారకూడదని, ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉండి, వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఒక వరమని, బాధితుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నిధులు మంజూరు చేయిస్తున్నామని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే తమ లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని పాయం వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సందర్శించి మొట్టమొదటిసారి సారపాకకు చెందిన భానోత్ మమత అనే మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేసి పండంటి మగబిడ్డకు పురుడు పోసిన వైద్యులను అభినందించారు. అదేవిధంగా నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.