23 March, 2026 | 7:51 PM

బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి

23-03-2026 12:00 AM

30, 31వ తేదీల్లో చలో ఢిల్లీలో మహాధర్నా

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 22(విజయక్రాంతి): బీసీలకు 50 శాతం రిజర్వేన్లు కల్పించాలని, అందుకు పార్లమెంట్లో రాజ్య ంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి. రాజేందర్, బీసీ ఐక్య వేధిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ మహారాజ హోటల్లో లో వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యఅతిధిగా ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజరై మా ట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఆస్సాం, పంజాబ్ తదితర రాష్ట్రాల నుండి వేలాది మందితో ఈ నెల 30, 31వ తేదీలలో చలో ఢిల్లీలో మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.

బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని, మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీశ్, పృద్వీ, చందు, అఖిల్, కిరణ్, జీవన్, రాజేశ్యాదవ్ పాల్గొన్నారు.