23 March, 2026 | 7:52 PM

కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు అన్నీ మోసమే..

23-03-2026 12:00 AM
  1. ఈ బడ్జెట్ మొత్తం మోసపూరితమైన బడ్జెట్

తెలంగాణను తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్...

బిఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్, మార్చ్ 22(విజయక్రాంతి):భారతదేశ చరిత్రలో ప్రజలను ఇంత దగాపూరితంగా మోసం చేసే బడ్జెట్ ను ఎన్నడూ చూడలేదని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ మండిపడ్డారు.దుండిగల్ సర్కిల్ పరిధి శంభీపూర్ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో క్రిష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కష్టాలు కన్నీళ్లు కూల్చివేతలు పేల్చివేతల పాలనగా మారిందన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తెలంగాణను తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్ అని ఆరోపించారు.

బడ్జెట్లో పేదలకు రైతులకు మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. రైతు భరోసా పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. రూ.15 వేల హామీ అవుతుందో లేదో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేకపోతున్నారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు, తులం బంగారం పేరుతో పేద మహిళలను మోసం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.

రెండు లక్షలు ఉద్యోగాలు రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికల హామీలో వృద్ధులకు రూ.4000 వికలాంగులకు రూ.6000 ఇస్తామని మాయమాటలు చెప్పి మాట తప్పారు. ఈ బడ్జెట్ పూర్తిగా మోసపూరితమైనదని, అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్ అని, ఇది డొల్ల బడ్జెట్ గోల్మాల్ బడ్జెట్ అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, ఎల్లుగారి సత్యనారాయణ, జక్కుల శ్రీనివాస్ యాదవ్, కుంటి నాగరాజు, శంకర్ నాయక్, గోపాల్ రెడ్డి, భరత్ కుమార్, సుధాకర్ రెడ్డి, ప్యాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, మాజీ ఎంపీటీసీ మహేష్, నాయకులు శామీర్పేట్ రంగయ్య, ఈ శ్రీనివాస్, మాదాస్ నర్సింగ్ రావు, కుంట్ల నందు, మాదాస్ నవీన్, రంజిత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, యువ నాయకులు విష్ణు, శ్రీకాంత్ యాదవ్, ప్రవీణ్ నాయక్, భాను, సద్దాం తదితరులు పాల్గొన్నారు.