7 June, 2026 | 1:58 AM

సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎమ్ స్కామ్‌పై ఎన్‌ఎస్‌యూఐ అల్టిమేటం

07-06-2026 12:00 AM

జూబ్లీహిల్స్, జూన్ 6 (విజయక్రాంతి): సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎమ్ ప్రాసెస్ లో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ వల్ల లక్షలాది మంది స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ నగరంలోని కోఎమప్ట్ సంస్థ హెడ్ ఆఫీస్ ను ఎన్‌ఎస్యూఐ తెలంగాణ శ్రేణులు ముట్టడించాయి. శనివారం తెలంగాణ ఎన్‌ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ యాదవల్లి వెంకటస్వామి నాయకత్వంలోని యూసుఫ్గూడలోని ఆఫీస్ ఎదుట భారీ నిరసన తెలిపారు.

సుమారు రూ.385 కోట్ల వర్త్ గల ఈ సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎమ్ కాంట్రాక్ట్ అలాట్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్స్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పోస్ట్కు రిజైన్ చేయాలని ఎన్‌ఎస్యూఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్యూఐ నాయకులు మాట్లాడుతూ.. ఓఎస్‌ఎమ్ స్క్పా తక్షణమే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చేత కాంప్రహెన్సివ్ ఇంక్వైరీ జరిపించాలన్నారు.

ఫ్రాడ్కు పాల్పడిన కోఎమప్ట్ సంస్థపై క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేసి లీగల్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ ఇష్యూస్, మాల్ప్రాక్టీసెస్ వల్ల లాస్ అయిన అఫెక్టెడ్ స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ తక్షణమే జస్టిస్ చేయాలన్నారు. విద్యార్థి హక్కుల రక్షణ కోసం తమ పోరాటం ఇక్కడితో ఆగదన్నారు. ఈ స్కామ్లో భాగస్వాములు అయిన అసలు దొంగలను పట్టుకుని,  విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.