9 May, 2026 | 10:44 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

జలకళను సంతరించుకుంటున్న రిజర్వాయర్లు

09-08-2024 12:05 AM
  1. సిద్దిపేట జిల్లాలో పలు రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు 
  2. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు ప్రారంభమైన నీటి విడుదల 
  3. ఈ నెల 19 వరకు జలాశయాల్లోకి కొనసాగనున్న పంపింగ్ 
  4. రైతులకు సాగు నీరందించడానికి ప్రభుత్వ నిర్ణయం

గజ్వేల్, ఆగస్టు 8: సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. అట్టడుగుకు చేరిన నీటిమట్టంతో కళతప్పిన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లోకి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఈ నెల 6వ తేదీ నుంచి రంగనాయక సాగర్‌లోకి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తుండగా, గురు వారం ఉదయం నుంచి మల్లన్నసాగర్, కొం డపోచమ్మ సాగర్ జలాశయాలకు నీటిని విడుదల ప్రారంభించారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున రంగనాయకసాగర్‌లోకి విడుదల చేస్తున్నారు.

6వ తేదీకి ముందు రంగనాయకసాగర్‌లో 0.68 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1.89 టీఎంసీలకు చేరింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్‌లోకి గురువారం నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతం మల్లన్నసాగర్‌లో నీటిమట్టం 8.6 టీఎంసీలు ఉండగా, ప్రతిరోజు 5200 క్యూసెక్కుల (0.4 టీఎంసీ) చొప్పున నీటిని పంప్‌హౌస్ నుంచి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి అక్కారం పంప్‌హౌస్, మర్కూక్ పంపుహౌస్‌ల ద్వారా కొండపోచమ్మ సాగర్‌లోకి రోజుకు 1250 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.

కొండపోచమ్మ సాగర్‌లో ప్రస్తుతం 4 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, మరో 6 టీఎంసీలకు వరకు నీరు నింపే అవకాశం ఉంది. ప్రభుత్వం తొలుత రిజర్వాయర్లలోకి ఈ నెల 11 వరకు నీటిని విడుదల చేయాలని ఆదేశించగా, దీనిని 19వ తేదీ వరకు కొనసాగించాలని గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నీటిని వర్షాకాలం పంటల సాగుతో పాటు యాసంగి పంటలకు కూడా వినియోగించనున్నారు.