7 June, 2026 | 1:24 AM

నగరంలో భారీ వర్షం

07-06-2026 12:00 AM
  1. వారం రోజులు వర్షాలే
  2. వాతావరణ శాఖ ప్రకటన

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురవగా, పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్ గూడ, అమీర్‌పేట్, సనత్‌నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, మోహ దీపట్నం, హిమాయత్‌నగర్, నాచారం, ఉప్ప ల్, అత్తాపూర్, హిమాయత్‌సాగర్, నార్సింగి, గచ్చిబౌలి, వనస్థలి పురం, హయత్‌నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వాహనాల రాకపోకలు నెమ్మ దిగా కొనసాగాయి.

రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురువనున్నాయని వాతావరణశాఖ ప్రకటిం చింది. గంటకు 40 నుంచి 50కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనుండగా, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండా లని పేర్కొంది. ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది.

బుధ వారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మిగతా రోజుల్లో రా ష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.