సమస్యలను వెంటనే పరిష్కరించండి
అధికారులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశం
రాజేంద్రనగర్, మే 27: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మైలార్దేవ్పల్లి డివిజన్ లోని ఆర్ జీ కే కాలనీలో ఆయన మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేయడంతో ఆయన జిహెచ్‌ఎంసి అధికారులు తో కలిసి పర్యటించారు.
అక్కడ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ నరేందర్ గౌడ్,వాటర్ వరక్స్ జిఎం లక్ష్మి, ట్రాన్స్కో అధికారులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






