28-05-2025 12:00:00 AM
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, మే 27: డిప్యూటీ సీఎం మళ్లీ భట్టి విక్రమార్క సభ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వెళ్లిబుచ్చారు. మంగళవారం తన నివాసంలో ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రా మంలో రూ.200 కోట్ల నిధులతో చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ, రూ.18 కోట్లతో చేపట్టి నియోజకవర్గం లో ని 8 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేయడం నియోజకవర్గ ప్రజల అ దృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఆయన కొనియాడారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి అయితే రైతులకు శాశ్వత లోవోల్టేజ్ విద్యుత్ సమస్య తీరుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులను చూసి నియోజకవర్గ ప్రజలు స్వాగతించడంతోపాటు ఒకపక్క విద్యార్థులు,మరోపక్క రైతుల్లో హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయని చెప్పారు.
ఇట్టి విషయం గురించి నియోజకవర్గ ప్రజలు పలువురు తనకు వ్యక్తిగతంగా కలిసి... మరికొందరూ పరోక్షంగా ఫోన్లు చేసి అభినందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసభను విజయవంతం చేసినా నియోజకవర్గ ప్రజలతో పాటు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.