ఇకనైనా పరిష్కరించండి.. లేదంటే ఇక్కడే చస్తా!
చెప్పుతో కొట్టినా చర్యలు తీసుకోలే బాధితుడు భాస్కర్ ఆందోళన
హుస్నాబాద్, జూన్ 5:హుస్నాబాద్ మున్సిపాలిటీ 14వ వార్డులో మురుగు కాల్వ సమస్య చివరకు చెప్పుదెబ్బల ఆరోపణల వరకు వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. నాలుగేళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్య ఇప్పటికీ అలాగే ఉండటంపై బాధితుడు వలబోజు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వపై ని ర్మించిన స్లాబ్ కారణంగా మురుగు నీటి ప్ర వాహం నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని, పలుమార్లు మున్సిపల్ అధి కారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసి నా ఫలితం లేకపోయిందని ఆయన ఆరోపించారు.
ఈ సమస్యపై గత నెల 25న ఇరు వర్గాల మధ్య నిర్వహించిన సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుని, తనపై చెప్పుతో దాడి జరిగిందని భాస్కర్ ఆరోపించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు తగిన చర్యలు కనిపించడం లేదని భాస్కర్ పేర్కొన్నారు. అదే సమయంలో మురుగు కాల్వ సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ స్పందించి సమస్యను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో భాస్కర్ తన ఆందోళనను విరమించినట్లు సమాచారం. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.






