28 July, 2026 | 1:09 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

06-06-2026 12:14 AM

జడ్జి కుమారి స్వరూప కాటం

ఇల్లందు టౌన్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇల్లందు కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి స్వరూప కాటం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, రాజ్యాంగం ప్రకారం ప్రకృతిని కాపాడడం మన ప్రాథమిక విధి అని అన్నారు.

గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలకు ప్రకృతి నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, నీటి వృథాను అరికట్టి, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి. ఇందిరా, న్యాయవాదులు, పోలీసు, అటవీ, ఎక్సైజ్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.