6 June, 2026 | 1:46 AM

సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన గాయం రమేష్ సన్మానించిన ఎమ్మెల్యే

06-06-2026 12:06 AM

సత్తుపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): పెనుబల్లి మండల సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గాయం రమేష్కు ఎమ్మెల్యే దంపతుల శుభాకాంక్షలు. పెనుబల్లి మండల సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మండాలపాడు గ్రామ సర్పంచ్ గాయం రమేష్ శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, డైనమిక్ లీడర్ మట్టా దయానంద్ గాయం రమేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మండల సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దంపతులు, ఆయనకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.