3 July, 2026 | 5:54 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

రైతుకు గౌరవం పెరిగింది

22-04-2025 12:00 AM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

 గోదావరిఖని, ఏప్రిల్21 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని, సమాజంలో రైతులకు కూడా గౌరవం పెరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. జనగామ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎలాంటి కటింగ్ లు లేకుండా వడ్ల కొనుగోలు కు పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి ప్రస్తుతం నాలుగో సారి కటింగ్లు లేకుండా కొనుగోలు జరుగుతున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో జనగామ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందారని, త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, .కాంగ్రేస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.