09-09-2025 01:34:38 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఆలయాల అభివృద్ధి విషయంలో దేవాదాయశాఖ స్థానిక సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, పూజారులు, నిపుణుల సూచనలు, సలహాలు కూడా స్వీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. భక్తుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సోమవారం మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
మేడారం జాతర నాటికి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సీఎం అనంతరం మేడారం అభివృద్ధికి సంబంధించి అనేక డిజైన్లను పరిశీలించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా చూడాలని సీఎం సూచించారు.
ప్రాంతాల వారీగా చెక్‌డ్యాంలు నిర్మించాలని ఆదేశించారు. వారంరోజుల్లో తాను స్వయంగా వచ్చి మేడారం అభివృద్ధి పనులు పరిశీలిస్తానని తెలిపారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి సీఎం అనేక సూచనలు, సలహాలిచ్చారు. సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
చికితకు అభినందన..
కెనడాలో ఇటీవల జరిగిన యూత్ వరల్డ్ ఆర్చరీ పోటీల్లో భారత్ తరఫున ఆర్చరీ పోటీల్లో పాల్గొని చికిత పతకం సాధించారు. సోమవారం ఆమె జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం ఈ సందర్భంగా చికితను అభినందించారు. ఒలింపిక్స్‌లోనూ చికిత పతకం సాధించేలా ప్రభుత్వం తరఫున శిక్షణ ఇప్పించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.