calender_icon.png 9 September, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారికి చేతకాకుంటే రిజర్వేషన్లు మేమిస్తం!

09-09-2025 01:35:26 AM

  1. బీసీలకు 42 శాతం అమలులో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  3. రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకుంటే, బీసీలకు తాము 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచం దర్‌రావు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, అటువంటివాళ్లు బీజేపీపై విమ ర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ర్టం లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు.

సోమవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకూ బీసీ సమాజానికి ఏమీ చేయలేదని, తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు రిజర్వేషన్ అంశాన్ని మళ్లీ లేవ నెత్తుతున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించబోయేది బీసీ ద్రోహ సభ మండిపడ్డారు.

285 జీవోను సవరణ చేయకుండా రిజర్వేషన్లు ఇవ్వలేరని తాము ఆనాడే చెప్పామని, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి రెండే ళ్లు దాంటిందని గుర్తుచేశారు. తాము బీసీ బిల్లును ఎక్కడా వ్యతిరేకించలేదని, అసెంబ్లీలో మద్దతు తెలిపామని చెప్పారు. కాం గ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోల విధా నం సరైంది కాదని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే కామారెడ్డి గడ్డమీద కాంగ్రెస్ అడుగుపెట్టాలన్నారు.  

మోర్చా అధ్యక్షుల నియామకం

పార్టీ రాష్ట్ర కమిటీని బీజేపీ ప్రకటించడంతోపాటు మోర్చాల అధ్యక్షులనూ నియ మించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. వైస్ ప్రెసిడెంట్లుగా బూర నర్స య్యగౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, ఎం జయశ్రీ, కొల్లి మాధవి, జరుప్లావత్ గోపి (కల్యాణ్‌నాయక్), రఘునాథ్‌రావు, బండ కార్తికరెడ్డి, జనరల్ సెక్రటరీ లుగా ఎన్ గౌతమ్‌రావు, టీ వీరేందర్‌గౌడ్, వేముల అశోక్, సెక్రటరీలుగా ఓ శ్రీనివాస్‌రెడ్డి, కొప్పు భాషా, భరత్‌ప్రసాద్, బండారు విజయలక్ష్మి, శ్రవంతిరెడ్డి, కర్ణం పరిణిత, బద్దం మహిపాల్‌రెడ్డి, తుటుపల్లి రవికుమార్, ట్రెజరర్‌గా దేవ్‌కి వాసుదేవ్, జాయిం ట్ ట్రెజరర్‌గా విజయ్ సూరాన జైన్, చీఫ్ స్పోక్స్ పర్సన్‌గా ఎన్వీ సుభాష్‌ను నియమించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మేక ల శిల్పారెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడిగా గణేశ్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బస్వాపురం లక్ష్మీనర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా క్రాంతికిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా నేనావత్ రవినాయక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా గండమల్ల ఆనంద్‌గౌడ్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగ్మోహన్ సింగ్‌ను నియమించారు.