calender_icon.png 9 September, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంపశయ్య నవీన్, అంతడుపల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవితసాఫల్య పురస్కారం

09-09-2025 01:32:57 AM

-13న రవీంద్రభారతిలో ప్రదానం

హైదరాబాద్/కరీంనగర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్త య్యగౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏటా రచయితలకు, కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య జీవితసాఫల్య పురస్కారాలకు ఈ ఏడాది సాహిత్యం విభాగంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపల రమాదేవిలు ఎంపికయ్యారు.

ఎంపిక కమిటీ కన్వీనర్ డాక్టర్ పొన్నం రవిచంద్ర సారధ్యంలో సీనియర్ పాత్రికేయులు, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్  దిలీప్‌రెడ్డి, రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి సభ్యులుగా ఉన్న జ్యూరీ కమిటీ ఈ వార్డులను ఎంపిక చేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎంపిక పత్రాన్ని సోమవారం అందజేశారు. పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో ఈ అవార్డులను వారికి ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందిస్తామని ట్రస్టు ఉపాధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ తెలిపారు.