17 June, 2026 | 10:09 AM

తెలంగాణలో నిజంగా ఇదే జరుగుతుందా?

05-02-2026 01:15 PM

మున్సిపాల్టీలపై రూ. 3,600 కోట్ల అప్పు 

హైదరాబాద్: 'సేవ్ తెంలగాణ-ఓట్ ఫర్ బీజేపీ'(Save Telangana Vote 4 BJP) అనే నినాదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సేవ్ తెలంగాణ పేరుతో పాటను రామచందర్ రావు విడుదల చేశారు. ధనిక తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని రామచందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్ని స్కాములు చేసిందో కవతను అడిగితే చాలన్నారు.

మరిన్ని తెలంగాణ తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.

కాంగ్రెస్ స్కామ్ ల (Congress scams) గురించి మంత్రులను అడగాలని తెలిపారు. ప్రజల ధనాన్ని కాంగ్రెస్ పాలకులు దోచుకుంటున్నారని రామచందర్ (N Ramachander Rao) వెల్లడించారు. మున్సిపాల్టీలపై రూ. 3,600 కోట్ల అప్పు ఉందని వివరించారు. రాజకీయ మద్దతుతో మున్సిపాల్టీ అధికారులు పేదలను హింసిస్తున్నారని తెలిపారు. ఎంతమంది అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ట్యాక్స్ టెర్రరిజం రాజ్యం ఏలుతోందని రామచందర్ రావు ధ్వజమెత్తారు. ఫ్రీ బస్సు అని చెప్పి.. డొక్కు బస్సులు పెడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లలోనే రూ. 80 వేల కోట్లు అప్పు చేశారని ఆయన లెక్క చెప్పారు. ఫ్రీ బస్సు సేవల పేరుతో పాత బస్సులు నడుపుతున్నారని కూడా విమర్శించారు.

దేశం, రాష్ట్రం తాజా అప్‌డేట్స్ కోసం విజయక్రాంతి న్యూస్ చూడండి.


1. తెలంగాణలో ట్యాక్స్ టెర్రరిజం అంటే ఏమిటి?

ట్యాక్స్ భారంతో ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని ట్యాక్స్ టెర్రరిజం అంటారు.


2. మున్సిపాల్టీలపై ఎంత అప్పు ఉంది?

సుమారు రూ.3,600 కోట్ల అప్పు ఉందని రామచందర్ రావు తెలిపారు.


3. ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు చేశారు.