8 April, 2026 | 10:15 AM

24వ డివిజన్‌లో భూమాగౌడ్ ప్రచారానికి స్పందన

06-02-2026 12:32 AM

కరీంనగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నగరంలోని 24వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటగిరి భూమాగౌడ్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ కార్పొరేటర్ గెలిలిపించాలని భూమాగౌడ్ కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో పార్కు నిర్మాణం, అంతర్గత రోడ్లనిర్మాణం, ప్రతి వీధిలో డ్రైనేజీ, డివిజన్లో ఏర్పాటు, వీధి లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

డివిజన్లో భవన నిర్మాణాలకు ఏమీ ఆశించకుండా అనుమతులు ఇప్పిస్తానని తెలిపారు. డివిజన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సి ఎం రేవంత్ ప్రజాపాలన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.