14 June, 2026 | 2:43 PM

Breaking News

జిల్లా పద్మశాలి సర్వసభ్య సమావేశానికి తరలి వెళ్లిన బాన్సువాడ పద్మశాలీలు   •   తుమ్మన్‌పేటకు బయలుదేరాం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తాం   •   పటేల్ ప్రధాని కావాల్సింది: ఎంపీ లక్ష్మణ్   •   అధైర్య పడొద్దు.. రైతుల పండగ ప్రభుత్వం   •   వర్ష నష్ట ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎంపీ   •   శ్రీ ఉమామహేశ్వరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు   •   బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం.. 21 ఏళ్ల యువతి మృతి   •   మహిళల టీ20 ప్రపంచకప్: నేడు భారత్-పాకిస్థాన్ మధ్య పోరు   •   ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన   •   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెల్లంపల్లి సమస్యలు   •  

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి

06-02-2026 12:31 AM

మర్రిగూడ, ఫిబ్రవరి 5 :  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రగతి పథంలో తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని  రాంరెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నర్సింహా అన్నారు గురువారం ’ప్రజా బాట’ కార్యక్రమం సర్పంచ్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది.గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.

గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్ లపంగి నర్సింహా,ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకెళ్లి ఈ పనులను మంజూరు చేయించారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలను తీర్చడమే తమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తోడ్పాటుతో రాంరెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగు నర్సింహా  సీనియర్ నాయకులు వెన్నమనేని సుధాకర్ రావు దామోదర్ రావు  లైన్మెన్ వెంకన్న వార్డు మెంబర్ లపంగి మహేందర్  పగిళ్ల శంకర్ బలుసుల సోమయ్య పాల్గొన్నారు.