15 April, 2026 | 2:41 AM

49వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారానికి స్పందన

08-02-2026 12:11 AM

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్ణకంటి ఉమారాణి హామీ

కరీంనగర్, ఫిబ్రవరి ౭ (విజయక్రాంతి): నగరంలోని 49వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కర్ణకంటి ఉమారాణి చేస్తున్న   ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. డివిజన్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ కార్పొరేటర్‌గా గెలిపించాలని ఉమారాణి కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్‌లో పార్కు, అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రతి వీధిలో డ్రైనేజీ, డివిజన్‌లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నని హామీ ఇచ్చారు.

డ్రైనేజీ, నీటి సరఫరా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. డివిజన్‌లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమారాణి కోరారు.