calender_icon.png 8 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 ఏళ్లలోనే రాష్ట్రం దివాలా

08-02-2026 12:12:44 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే అవినీతికి వేసినట్టే! 

నిజాయతీ పాలన కోసం బీజేపీని గెలిపించండి

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సంగారెడ్డి, జనవరి 7(విజయక్రాంతి): 12 ఏళ్లలో రాష్ట్రం దివాలా తీసిందని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే అవినీతికి వేసినట్లేనని, ఈ రెండు పార్టీలు అవినీతి పాలన కు నిదర్శనంగా నిలుస్తాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో శనివారం కార్న ర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియ దన్నా రు. పటాన్‌చెరు ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ నా? కాంగ్రెస్ పార్టీనా? తెలియదన్నారు.

భూ దందా చేస్తూ స్వప్రయోజనాల కోసం మాత్రమే తాపత్రయపడతారని విమర్శించారు. మోదీ అవినీతి రహిత పాలన అంది స్తున్నారని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వేల కోట్లు దోచుకున్నారని, ఈ విషయాన్ని ఆయన కూతురు కవితనే చెపుతోందని, కేసీఆర్ ఆయన కుటుం బాన్ని బం గారు కుటుంబంగా మార్చుకున్నాడని విమర్శించారు. ప్రాజెక్టులు, భూములు, కాంట్రాక్టుల పేరు మీద దోపిడీకి పాల్పడ్డారు. అవి నీతి, కుటుంబ పాలన పోవాలని కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేశారు తప్పితే కాంగ్రెస్‌పై ప్రేమతో ప్రజలు ఓటు వేయలేదన్నారు.

వాళ్లు ఏ విధంగా దోపిడీ, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారో కాంగ్రెస్ కూడా అదే పద్ధతిని అవలంభిస్తోందన్నారు. రాష్ట్రం 420 హామీలతో దివాలా తీసింది అన్నారు. కేసీఆర్ తన హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ వచ్చాక మరో రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేశారని, అప్పులతో చేసింది ఏమిటి అంటే దోచుకోవడం, దాచుకోవడమే తప్పితే.. చేసిన అభి వృద్ధి శూన్యం అన్నారు. పదేళ్లు కేసీఆర్ కు టుంబం చేతిలో బంధీ కాగా.. రెండేళ్లు సోని యా చేతిలో చితికి పోయిందన్నారు.

ఈ తరుణంలో నీతి, నిజాయితీతో కూడిన సమర్ధవంతమైన పార్టీ కావాలి. తెలంగాణ కోసం నిజంగా పోరాడిన పార్టీ అవసరమన్నారు. అది కేవలం బీజేపీ మాత్రమేన న్నారు. భార్యభర్తలు మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్ వింటారు... ఈ జాబితాలో చిత్ర పరిశ్ర మ, వ్యక్తులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారి విన్న సమాఆరం ఆధారంగా వారిని బ్లాక్ మె యిల్ చేశారని ఆరోహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గో దావరి అంజిరెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.