27 May, 2026 | 3:01 AM

లింగంపల్లి ఖుర్ద్ గ్రామంలోని మల్లారం చెరువు పునరుద్ధరణ

27-05-2026 01:17 AM

మరమ్మత్తు నిధుల కింద రూ.1.65 కోట్లతో శంకుస్థాపన

ఎల్లారెడ్డి, మే 26 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనీ లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ద్ గ్రామంలో మల్లారం చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ద్ గ్రామంలోని మల్లారం చెరువు పునరుద్ధరణ మరియు మరమ్మత్తు పనులను ప్రారంభించారు.

వరద నష్టం మరమ్మత్తు నిధుల కింద రూ.1.65 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ స్థాయిలో పలుమార్లు సంబంధిత అధికారులను, ప్రభుత్వ పెద్దలను కలిసి నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో గ్రామ రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి, భూగర్భ జలాలు పెరిగి గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే  తెలిపారు. గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.