27 May, 2026 | 2:06 AM

కేసీఆర్ తుగ్లక్.. రేవంత్ మహాతుగ్లక్

27-05-2026 01:16 AM
  1. బీఆర్‌ఎస్ హయాంలో అసెంబ్లీ నియోజకవర్గాలను ముక్కలుచేసి మూడు జిల్లాల్లో కలిపారు
  2. అదే తరహాలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను విభజిస్తున్నారు    
  3. హైదరాబాద్‌ను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పంచుకుతింటున్నాయి
  4. ఆ రెండు పార్టీలు మజ్లిస్‌తో కాపురం చేసినవే..
  5. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

* హిల్ట్ పాలసీ పేరుతో కాలుష్యకారక పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలికి తరలించాల నేది ఓ నెపం. నగరం లోపలఉన్న పారిశ్రామిక ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చి భారీ రియల్ ఎస్టేట్ స్కాంకు తెరలేపారు. పరిశ్రమల తరలింపు వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు? ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి? అనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు.

 బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు 

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ తుగ్లక్ అయితే, సీఎం రేవంత్‌రెడ్డి మహాతుగ్లక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. నాడు కేసీఆర్.. అసెంబ్లీ నియోజకవర్గాలను ఎలా ముక్కలుగా చేసి మూడు జిల్లాల్లో కలిపా రో.. అదే తరహాలో రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని మూడు ముక్కలుగా చేశారని మండి పడ్డారు. హైదరాబాద్‌పైన ఈ ప్రభుత్వానికి ఎందుకంత కసి అని? ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు పంచుకుతింటున్నాయని, గతంలో కేసీఆర్ కూడా ఇలానే తుగ్లక్ పనులు చేశారని పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ఎంఐఎం పార్టీ కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తమ ప్రయోజనాల కోసం హైదరాబాద్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న మజ్లిస్, బీఆర్‌ఎస్, కాంగ్రెస్  పార్టీలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి, సుందర నగరంగా తీర్చిదిద్దే బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే .. అది మజ్లిస్‌కు వేసినట్లేనని, ఆ రెండు పార్టీలు మజ్లిస్‌తో కాపురం చేసినవేనని మండిపడ్డారు. హైదరాబాద్ కూకట్‌పల్లి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గరీబోళ్లను నిలువునా ముంచితే, నేటి కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లు అంటూ ప్రజలను నిమ్మించి వంచిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం కట్టిన కొన్ని అరకొర ఇళ్లనే ఇప్పుడు చూపించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు.

తాగునీటి సరఫరా వ్యవస్థ పడకేసింది

హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రోహిణి కార్తె ముగుస్తు న్నా, వానాకాలం ముంచుకొస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు నీటి ఎద్దడిని నివారించలేకపోయిందన్నారు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, జలమండలి తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

మరోవైపు వర్షం వస్తే బస్తీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాం లో వరదలు వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్లు చేరిన వారిలో కొంతమందికి రూ.10,000 చొప్పున చేసిన సాయం కూడా బీఆర్‌ఎస్ నేతల జేబుల్లోకే పోయిందని ఆయన గుర్తు చేశారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు.

హిల్ట్ పాలసీ పేరుతో కుంభకోణం..

హిల్ట్ పాలసీ పేరుతో కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలనే నెపంతో, లోపల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చి భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. పరిశ్రమల తరలింపు వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు? ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి అనే అంశంపై ‘ఇంపాక్ట్ అసెస్మెంట్’ చేయలేదన్నారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడితే, కాంగ్రెస్ కమీషన్ల శాతాన్ని 30-40 శాతానికి పెంచి బిల్డర్లను వేధిస్తోందని, నగరంలో కొత్త వెంచ ర్లు రాక రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదన్నారు. 

మజ్లిస్ కోసమే సైబరాబాద్ కార్పొరేషన్..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావాలనే ఆలోచన కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమేనని రాంచందర్‌రావు ఆరోపించారు. 300 డివిజన్‌లు ఉంటే మజ్లిస్ గెలవద ని,  అందుకే  జీహెచ్‌ఎంసీని అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించార ని, అందులో ఒక భాగాన్ని ఆ పార్టీకి దారాదత్తం చేయడానికి రేవంత్‌రెడ్డి స ర్కార్ సిద్ధమైందని విమర్శించారు. అధికారులను మ్యాప్ అడిగితే ఎలాంటి స్పష్ట త లేదని, ఎక్కడ ఏ సరిహద్దు వస్తుందో తెలియకుండానే నగరాన్ని ముక్కలు చే యడానికి కుట్ర చేస్తున్నారన్నారు.