calender_icon.png 17 February, 2026 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

17-02-2026 07:10:21 PM

* నేడు ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నను విజయవంతం చేయాలి

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయం పిఆర్టియు భవన్ లో మంగళవారం రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ బకాయిల సాధన సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఎం.డి అబ్దుల్ గఫర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర పాల్గొని, మాట్లాడుతూ మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 23 నెలలు గడిచిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో పెన్షనర్లు మానసిక వేదనకు గురై ఆరోగ్యం క్షీణించి, ఆనారోగ్యంపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, లక్షలాది రూపాయలు వెచ్చించలేని స్థితిలో, రిటైర్మెంట్ డబ్బుల కొరకు ఎదురుచూస్తూ అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఇఎంఐలు కట్టలేక పిల్లల పెళ్లిళ్లు చేయలేక మానసికశ్కోభకు గురవుతున్నారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 65 మంది ఉద్యోగు రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా గాని ముఖ్యమంత్రి కనికరించడం లేదని పెన్షనర్ల పట్ల దయ, కనికరం చూపుతలేరని తెలిపారు. ఇప్పటికైనా రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన జిపిఎఫ్, గ్రాట్యూటీ, కమ్యూటేషన్ లీవ్ ఎన్కాష్మెంట్, పిఆర్సి 2020 ఏరియర్స్, సరెండర్ లీవులు తదితరు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర మాట్లాడుతూ రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.

గత నాలుగు నెలల నుండి వివిధ రకాల పోరాటాలు చేస్తున్న అనేక విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ రిటైర్మెంట్ బకాయిలు చెల్లించినందున, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అత్యధిక రిటైర్మెంట్ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కే. దేవదాస్, జిల్లా కోశాధికారి ఎస్. కుమారస్వామి, జాయింట్ సెక్రెటరీ మేకరి దామోదర్, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, బి. సారయ్య, విశ్వనాథం, శ్యామ్, సమ్మయ్య, చీకటి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.