17 April, 2026 | 3:43 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

దేవునిపల్లిలో న్యాయ అవగాహన కార్యక్రమం

17-02-2026 07:15 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి టి. నాగరాణి  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దేవునిపల్లి గ్రామంలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులకు అర్థమయ్యే రీతిలో “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అంశంపై అవగాహన కల్పించారు.

భద్రత కలిగించే స్పర్శ గుడ్ టచ్, భయం లేదా అసౌకర్యాన్ని కలిగించే స్పర్శ బ్యాడ్ టచ్ అని పిల్లలకు వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పాలని సూచించారు. అలాంటి విషయాలను దాచుకోవద్దని, నిజం చెప్పిన పిల్లలను చట్టం రక్షిస్తుందని ఆమె ధైర్యం కల్పించారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ‘కాదు’ అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి.

భయపడకండి, మీరు ఒంటరివారు కారు” అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని, మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని ఆమె పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు లేదా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) లీగల్ ఎయిడ్ హెల్ప్‌లైన్ 15100 కు కాల్ చేయవచ్చని తెలిపారు.

తదనంతరం పాఠశాల ప్రాంగణం, మధ్యాహ్న భోజన వివరాలు,  పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి, అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో  శ్రీమతి స్రవంతి , డీసీపీవో, ఎల్లయ్య, ఎంఈఓ కామారెడ్డి ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు  స్వర్ణలత ,  సాధన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కామారెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.