03-07-2025 12:23:51 AM
* సుదీర్ఘంగా బనకచర్లపై మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు బీజేపీ వైఖరిపై మాట్లాడలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి బనకచర్లపై తన ప్రయత్నాలు చే యడం, కేంద్రంలోని బీజేపీ ఈ ప్రాజెక్టుకు తన వంతుగా అండగా ఉన్న క్రమంలో బీజేపీని ప్రశ్నించాల్సిన ఆయన అంతగా బీజేపీ ఇరుకున పెట్టేలా మాట్లాడలేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కిషన్‌రెడి,్డ రేవంత్ రెడ్డి మిత్రులు అని విమర్శ చేశారే తప్ప పెద్ద గా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించలేదని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ప్రజాభవన్ వేదికగా గోదావరి బనకచర్లపై జులై 6, 2024న సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, గురుదక్షిణ చెల్లిస్తూ తెలంగాణ నీటి హక్కులకు రేవంత్‌రెడ్డి మరణ శాసనం రాశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అప్పటి సీఎం చంద్రబాబు, జగ న్‌ల హయాంలో ముందుకు పడని బనకచర్ల ఇప్పడు ఎందుకు ముందుకు పోతోం దని ప్రశ్నించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా విజయవాడలో చంద్రబాబును కలిసి బెజవాడ బజ్జీలు తిని బన కచర్లకు మద్దతు చెప్పి వచ్చారని ఆరోపించారు. ఈ విషయాలపై అసెంబ్లీలో మాట్లా డుదామా అని సవాల్ విసిరారు. రేపు(గురువారం) ఉదయం అసెంబ్లీ పెడితే తాను చర్చించేందుకు సిద్ధమని, మైక్ కట్ చేయొద్దున్నారు. 15 రోజులు కృష్ణా, 15 రోజులు గోదావరి మీద మొత్తం నెల రోజులు మాట్లాడుదాని, సభలో మీరు, మేము ప్రజెంటేషన్ చేద్దామని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ఎమ్మె ల్యే అనిరుధ్ రెడ్డి బనకచర్ల మీద ఉత్తరాలు రాయడం కాదని.. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఎవరో చెబితే బాగు టుందని హితవు పలికారు. కృష్ణాలో ఫైనల్ అవార్డు వచ్చే దాకా 50:50 చేసుకుందామని మీ సెక్రెటరీ రాశారని, అదే డిమాం డ్‌ను బీఆర్‌ఎస్ 28 లెటర్లు రాసి అడిగిందన్నారు. 299 టీఎంసీలకు బీఆర్‌ఎస్ ఒప్పు కున్నదని ఎవరైనా అంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ బనకచర్లపై అధికారిక ప్రజెంటేషన్ అయితే అందరు ఎమ్మెల్యేలను ఎందుకు పిలువలేదని ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతిలో ఇచ్చినట్లు ఉందని, పీపీటీని తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక ఏపీ తయారు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
జులై 14, 2014న కృష్ణాలో 299 టీఎంసీల కేటాయింపు అన్యాయం అని కేంద్రానికి లేఖ రాశామని, కానీ రాష్ర్టం వచ్చిన 42 రో జుల్లోనే ఆనాటి కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ రా సిన మరణ శాసనమని హరీశ్‌రావు మండిపడ్డారు. అడ్ హక్‌కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని సీఎం అని మండిపడ్డారు.
సలహాదారుడిగా తెలంగాణ హక్కులను కాలరాసిన వ్యక్తి
2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో ఉంటుందని, మీ అడ్వుజర్ ఆదిత్యానాథ్ సంతకం పెట్టారని ఆరోపించారు. తెలంగాణ హక్కులను కాలరాసిన వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నారని, బాబు చెప్పు చేతుల్లో ఉన్నరా, తెలంగాణకు పని చేస్తున్నారా ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని జోషి అంటే, లేదు లేదని చెప్పిన వ్యక్తి ఆదిత్యా నాథ్ దాస్ అని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తిని సలహాదారుడిగా సీఎం పెట్టుకున్నారని, తాత్కాలిక ఒప్పందంపై సలహాదారుడే సంత కం పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాసు వంటి అనేక ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. దీన్ని పీపీటీలో ఎందుకు చూపించలేదన్నారు.
రేవం త్‌రెడ్డికి బనకచర్ల కట్టే బాబు బంగారం లెక్క కనిపిస్తే, బీఆర్‌ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తున్నదా అని ఆయన ఫైర్ అయ్యారు. చవకబారు ముచ్చట్లు రాహుల్‌కు చెప్పుకోవాలని సూచించారు. బ్యాగులు మోసి బ్యాడ్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నారని, బనకచర్ల కోసం బొంకుమెన్‌గా మారొద్దని హిత వు పలికారు. రేవంత్ టెక్నికల్‌గా కాంగ్రెస్ సీఎం అని, కానీ హృదయం ఇంకా టీడీపీలోనే ఉందని ఎద్దేవా చేశారు.
పాత డేట్‌తో లెటర్
నవంబర్ 15, 2024న లింక్‌కు సహకరించాలని నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు లేఖ రాశారని, డిసెంబర్ 31, 2024న నిర్మలకు మరో లేఖ రాశారని, రూ. 80 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారన్నారు. బనకచర్లపై తాను పీపీటీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అదే రోజు పాత డేట్ వేసి లెటర్ విడుదల చేసారని ఆయన ఆరోపించారు.
ఏ విధంగా చూసినా బనకచర్ల తెలంగాణకు మరణ శాసనం కాబోతుందన్నారు. 299:512 హక్కుల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టిండు అని చూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గోదావరిలో 968 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, కృష్ణాలో 299:512ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే కదా అని అన్నారు. మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యిందని ఆరోపించారు.
సెక్షన్-3పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయని, 2025లో ఈ ఏడాది 763 టీఎంసీలు మనకు వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ అమాయక చక్రవర్తి 500 టీఎంసీలు చాలు అంటున్నారని అన్నారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య ఫెవికాల్ బంధమని, ఇద్దరు కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బ తీశారని మండిపడ్డారు. ఎస్‌ఎల్బీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే కిషన్‌రెడ్డి ఎందుకు ఎన్డీఎస్‌ఏకు లేఖ రాయట్లేదని ప్రశ్నించారు.