03-07-2025 12:23:20 AM
ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్
ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఐఎన్‌టీ యూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఐఎన్ టీయూసీ లో సేవలందిస్తూ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ నాయకులుగా ఉన్న వారందరు భారీ ఎత్తున హాజరుకావాలని అయన కోరారు.
ఈ మేరకు బుధ వారం ఆయన బషీర్ బాగ్ లో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ తెలంగాణ వ్యవహారాల ఇం చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షు లు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఈ సమ్మేళనంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను మల్లికార్జున ఖర్గే ప్రస్తావించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేస్తారని అయన తెలిపారు.
పెద్ద సంఖ్యలో ఈ సమ్మేళనంలో పాల్గొని మల్లికార్జున ఖర్గే సందేశంతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను ప్రజలకు చేరవేయాలని గుంజ శ్రీనివాస్ అన్నారు