రైతులను విస్మరిస్తున్న రేవంత్ ప్రభుత్వం: కట్ట మల్లేష్
వేములపల్లి, విజయక్రాంతి: ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 28 నెలలు కావస్తున్నప్పటికీ రైతు భరోసా ఒక్క సీజన్లో మాత్రమే వేశాడు. మిగతా నాలుగు సీజన్లకు రైతులను మభ్యపెడుతూనే ఉన్నాడు.
కెసిఆర్ పాలించిన పది ఏండ్లలో రైతాంగానికి పెద్దపీట వేసి రైతు భరోసా ప్రతి సీజన్ కి అందించి రైతుల ఎదుగుదల పట్ల పెద్దన్న పాత్ర పోషించాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాని కనుమరుగయ్యేలా పావులు కదుపుతుండడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అదేవిధంగా యూరియాని సైతం పంటకు సకాలంలో వేయకుండా మాయదారి యాప్ను తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను విస్మరించకుండా అందించాల్సిన రైతు భరోసా యూరియా సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించకపోతే రైతు ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.




