చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్
పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తిర్యాని మండలంలోని ఆశ్రమ హైస్కూల్‌లో గురువారం “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఏఎస్పీ చిత్తరంజన్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.ఆశ్రమ స్కూల్ విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువు ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. పదవ తరగతి విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించవచ్చన్నారు. గ్రామీణ ,గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగితే దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, తీర్యాని ఎస్‌ఐ వెంకటేష్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




