26-12-2025 02:06:54 AM
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి సీఎం కావడం రాష్ట్ర దౌర్భాగ్యమని, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. కేసీఆర్ హయం లో పరిశుభ్రతతో కనిపించిన పల్లెలు కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రసమయి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన స్థానాలన్నీ మావే అని రేవం త్‌రెడ్డి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కొత్తగా గెలిచిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాన్ షాప్ దగ్గర గుట్కా తినేవాడి కంటే వల్గర్‌గా మాట్లాడారని మం డిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేస్తా అనే ముందు దేశంలోని 29 రాష్ట్రాల్లో కాం గ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిందో చెప్పాలన్నారు. మస్తాన్ మటన్ షాప్ దగ్గర కేసీఆ ర్‌కు ఉద్యోగం ఇస్తా అని అహంకారంతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి బ్రతుకెంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేగులు మెడలో వేసే ఎక్స్ పర్ట్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశా రు. తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీష్‌రావు గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌రెడ్డికి ఉం దా అని ప్రశ్నించారు.
కేటీఆర్ తెలంగాణ హీరో అని, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కేటీఆర్ ఆంధ్రలో చదువుకున్నారని మాట్లా డే రేవంత్‌రెడ్డి.. ఆయన బిడ్డకు ఆంధ్రా ప్రాం తానికి చెందిన వ్యక్తితో ఎందుకు పెళ్లి చేశారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికి తెలంగాణ తల్లి శోభమ్మ అని, అలాంటి తల్లిని అవమానిస్తారా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టగానే రేవంత్ లాగు తడిచిపోయింది : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని, బూతుల పురాణం మాట్లాడడమే సరి పోతోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టగానే రేవంత్‌రెడ్డికి లాగు తడిచిపోయిందని, అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్ పార్టీ.., రేవంత్‌రెడ్డి ఉన్నంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయమన్నా రు. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే సొంత మనవడే భయపడేలా ఉన్నాడని, పిట్టలదొర కంటే హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు నాలుగున్నర కోట్ల మంది దీవెనలు ఉన్నాయని చెప్పారు.
సీఎం కుర్చీ పరువు తీసేలా రేవంత్‌రెడ్డి మాటలు : ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
విలువలతో కూడిన రాజకీయాలు చే యాలని, అలాంటి విలువలు ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో లేవని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి బూతులతో పోటీపడుతున్నారని, ఆయన మాటలు చూస్తుంటే ముఖ్యమంత్రి కుర్చీ పరువు పోతోందన్నా రు. రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం బ్రోకర్ దందా జరుగుతోందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించుకొని పోతుంటే, జరుగుతున్న అన్యాయంపైన కేసీఆర్ మాట్లాడారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుంటుపడిందని వెల్లడించా రు. ఈ రాష్ర్టంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ పార్టీనే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.