26-12-2025 02:08:19 AM
మొయినాబాద్ డిసెంబర్ 25 (విజయ క్రాంతి): గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతతోనే సాధ్యమైన సర్దార్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారెడ్డి కృష్ణారెడ్డి, కేతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్యచారిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గోడుగు యాదయ్య యువనాయకులను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత తప్పుడు ఆలోచన లేకుండా దురలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో, గ్రామ పెద్దలతో కలిసి వని చేయాలన్నారు.
అప్పుడే యువతకు మంచిపేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని సూచించారు. కేతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోడుగు యాదయ్య సేవా కార్యక్రమాలతో పాటు కేతిరెడ్డిపల్లి, కంచమోనీగూడ గ్రామాల ప్రజలు ఆదరించి అభిమానించి అధిక మెజార్టీతో మంచి వ్యక్తిని ఎన్నుకున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంత బలంగా ఉందని నూతన సర్పంచ్ గోడుగు యాదయ్య పేర్కొన్నారు. ప్రజలు ఆదరించి అభిమానించి గెలిపించినందుకు మరింత సేవలు చేసేందుకు తనవంతు కృషిగా పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్రెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.