calender_icon.png 26 December, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య ప్రియుడి ఇంటి ముందు భర్త ధర్నా

26-12-2025 01:44:49 AM

  1. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదని ఆరోపణ
  2. నిజామాబాద్‌లో ఘటన                 

నిజామాబాద్, డిసెంబర్25 (విజయ క్రాంతి): ఎన్నో ఆశలతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి, కేవలం నాలుగు నెలలకే గుండెపగిలే అనుభవం ఎదురైంది. పెళ్లికి ముందే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆ తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగుతోందని కుమిలిపోతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి దిగాడు. ఫ్లెక్సీ వే యించి మరీ భార్య ప్రియుడి ఇంటి ముం దు ధర్నాకు దిగాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ప్రశాంత్ అనే వ్యక్తికి ఈ ఏడాది ఆగస్టు 13న సంయుక్తతో వివాహమైంది.

అయితే తన భార్యకు బావ వరుస అయిన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సం బంధం ఉన్నట్లు వారిద్దరి మధ్య జరిగిన చా టింగ్ ద్వారా గుర్తించినట్లు ప్రశాంత్ పేర్కొన్నాడు. భార్య మోసం చేసిందంటూ కొంత కాలంగా వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నాడు. ఇక, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక ఫ్లెక్సీ వేయించి ప్రియుడి ఇంటి ముందు ప్రశాంత్ ధర్నాకు దిగాడు. వారిరువురి మధ్య జరిగిన చాటింగ్‌లు, ఇతర ఆధారా లు చూపించినా పోలీసులు పట్టించుకోవ టం లేదని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.