7 July, 2026 | 7:39 PM

Breaking News

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •  

రేవంత్‌రెడ్డీ.. సిద్దిపేటపై ఎందుకింత కక్ష?

18-03-2026 01:57 AM
  1. అభివృద్ధిపై అక్కసు పెట్టుకొని ఇక్కడ ఎట్లా అడుగుపెడతావు

నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా?

రూ.1,070 కోట్ల నిధులను ఎందుకు రద్దుచేశావు

ముఖ్యమంత్రికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): సిద్దిపేటపై ఎందుకింత కక్ష రేవంత్ రెడ్డీ.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై మీకు ఈర్షాద్వేషాలేనా అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్ర శ్నించారు. సిద్దిపేట నియోజకవర్గంలో మీరు రద్దు చేసిన రూ.1,070 కోట్ల నిధులను పునరుద్ధరించి నిలిచిపోయిన అభివృద్ధి కొనసా గించాలని డిమాండ్‌చేశారు.

నెల 22న ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు మంగళ వారం బహిరంగ లేఖ రాశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా సిద్దిపేట నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నానని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేట పేరెత్తనిదే రోజు గడిచేది కాదని, సిద్దిపేట అభివృద్ధిపై మీరు ప్రదర్శించిన ఈర్షాద్వేషాలను మా నియోజకవర్గ ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని లేఖలో పేర్కొన్నారు..

ఆనాడు కలలో కూడా సిద్దిపేటను తలచిన మీరు ఈనాడు అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సిద్దిపేట అనే నియోజకవర్గం ఒకటుందనే విషయాన్ని మరచిపోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శంచారు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే గాకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేశారని, నిధులు రద్దు కావడంతో 27 నెలలుగా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

సిద్దిపేట ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే మీరు రద్దు చేసిన నిధులను పునరుద్ధరించాలని, అర్ధాంతరంగా ఆగిన పనులు జరిగేలా చర్యలు తీసుకొని మీ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు.