10-04-2025 01:40:05 AM
చేర్యాల, ఏప్రిల్ 9 అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రేవంత్ రెడ్డి పేదింటి పెద్ద కొడుకుల మారాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము రవి అన్నారు. చేర్యాల మండ లంలోని దూదేకులపల్లి ప్రభుత్వం సన్న బి య్యం పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రామంలోని మంజ నర్సవ్వ ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం సన్నబియ్యం పథకం అమలు చేయడంతో పేద ప్రజల ముఖాలలో ఆనందం వెల్లివిరిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఏనా డు ఇటువంటి పథకాల గురించి ఆలోచననే చేయలేదన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజలు రేవంత్ ను పెద్ద కొడుకుల చూస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజ మల్లేశం, పిఎసిఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, అందే నాని, తదితరులు పాల్గొన్నారు.