calender_icon.png 27 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకున్న రేవంత్ భీమవరం బుల్లోడు!

27-12-2025 03:00:10 AM

  1. ప్రజాస్వామ్యం లేకపోతే రేవంత్‌రెడ్డిని ఎడమకాలి చెప్పుతో కొట్టేవాడిని
  2. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి తట్టుకోలేరు
  3. రేవంత్‌రెడ్డి కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు
  4. పెయింటింగ్స్ ఏసేటోడు దొంగ పనులు చేసి సీఎం అయిండు
  5. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో కూడా గెలవనీయం
  6. మీ అమ్మ, మీ అయ్య నేర్పిన భాష గిదా 
  7. గీతమ్మ.. రేవంత్‌రెడ్డిని జల్దీ కట్టేయండి.. లేకపోతే ఎవరినైనా కరుస్తాడు 
  8. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

* నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు నొప్పి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది, ఆ సమయంలో నేను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్, పుణె, అమెరికా.. ఇలా ప్రపంచమంతా తిరిగి చదువుకున్నాను.

* రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఆలోచించుకోవాలి.  మంచి పనులతో పైకి రావాలేకాని.. లంగా, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, జైలుకు వెళ్లి రావడం గొప్ప విషయం అన్నట్టు ఫోజులు కొడుతున్నారు. 

అసెంబ్లీకి వస్తే గుండె దడే..

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి తట్టుకోలేరు. కేసీఆర్ ఒక ప్రెస్‌మీట్ పెడితేనే కాంగ్రెస్ నాయకులకు చలి జ్వరం పట్టుకుంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి గుండె ఆగుతది. రేవంత్‌రెడ్డి కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు. 

హైదరాబాదవ్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : తాను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్, ఆంధ్రా నుంచి అల్లుణ్ణి తెచ్చుకోవడం తప్పుకాదా? అందుకే ఆయనకు ‘భీమవరం బుల్లోడు’ అని పేరు పెడితే సరిపోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏమన్నా అం టే తనకు అహంకారం అంటారని, కానీ అసలైన అహంకారం రేవంత్ రెడ్డిదా లేక తనదా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. ‘నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు నొప్పి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది, ఆ సమయంలో నేను గుంటూరులోనే కాకుండా హైదరాబాద్, పూనా, అమెరికా.. ఇలా ప్రపంచమంతా చదువుకున్నాను’ అని స్పష్టం చేశారు.

రేవంత్ మాది రిగా తాను చదువు సంధ్య లేకుండా తిరగలేదని, రేవంత్‌రెడ్డికి వారి అమ్మ, అయ్య చక్కటి తోవ చూపించకపోతే తానేం చేయాలని ఎద్దేవా చేశారు. తనకు ఇంగ్లీష్, హిందీ రావడం చూసి రేవంత్ రెడ్డి ఎందుకు ఏడుస్తున్నారని, సత్తా ఉంటే ఆయన కూడా నేర్చుకోవాలని, ఆయనను ఎవరూ ఆపలేదని చురకలంటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలించారని, హైదరాబాద్ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువే అన్నారు. తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా వాడుతున్న అసభ్యకర భాష, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నేతల చేరికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి భాష చూస్తుంటే దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకుని కొట్టాలని ఉందని, కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాము కాబట్టి కుర్చీకి ఇచ్చే గౌరవంతో ఊరుకుంటున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టాలని తనకు లేదని, కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడిని, రెండుసార్లు ప్రజలు గెలిపించిన సీఎంని, నా తండ్రిని తిడుతుంటే ఒక కొడుకుగా ఆవేశం రాదా అని ప్రశ్నించారు.

కేసీఆర్ రోజు తిడుతూనే ఉన్నారని, ఒకరోజు చనిపోవాలను కుంటారు.. ఒకరోజు కాలు విరిగింది అంటారని విమర్శించారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చుండబెట్టినట్టు పరిస్థితి ఉంద ని మండపడ్డారు. కేసీఆర్ బయటకు రావాలని కోరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటున్నారని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి తట్టుకోలేరని హెచ్చరించారు.

కేసీఆర్ ఒక ప్రెస్‌మీట్ పెడితేనే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం పట్టుకుందని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి గుండె ఆగుతదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనని విమర్శించారు. 

రోడ్ల మీద పెయింటింగ్స్ ఏసేటోడు..

రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. జీవితంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావడం తప్పు కాదు, కానీ అది మంచి పనులతో రావాలని సూచించారు. లంగ పను లు, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, జైలుకు వెళ్లి రావడం గొప్ప విషయం అన్నట్టు పోజులు కొడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని, ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి పైసలు పంపిస్తూ పదవి కాపాడుకుంటున్నారని’ అని ఎద్దేవా చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి కొడుకు భూ ములు కబ్జా చేస్తుంటే కేసు పెట్టిన పోలీసు అధికారిని లూప్ లైన్‌లో పెట్టారని ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసేవన్నీ గాడ్సే పనులేనని మండిపడ్డారు. పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి బీఆర్‌ఎస్‌లో ఉన్నామని చెబుతున్నారని, స్పీకర్ కళ్లు ఉండి చూడలేని ధృతరా ష్ర్టునిలా తయారయ్యారని ఆరోపించారు. ఎన్నికలకు భయపడి పది మంది ఎమ్మెల్యేలు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 

ఇదా ముఖ్యమంత్రి వాడే భాష?...

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని, కానీ మీలో రోజూ ఈ ఏడుపు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలు గురించి ప్రజలు అడిగితే ‘గుడ్లు పీకి గోటీలాడతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అని సమాధానం చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ముసలోళ్లు వచ్చి 4000 పెన్షన్ అడిగితే పేగులు తీస్తానని, విద్యార్థులు ఉద్యోగాల గురించి అడిగితే ‘లాగుల తోండలు విడిపిస్తా’ అని బెదిరించడం ఏ రకమైన సంస్కారమని నిలదీశారు. మీ అమ్మ, మీ అయ్య నేర్పిన భాష గిదేనా అని ప్రశ్నించారు. గత రెండేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం, కేవలం తిట్లు తిట్టడం తప్ప నీకు ఏమీ రాదని విమర్శించారు.

కుర్చీకి ఇచ్చే గౌరవంతోనే ఊరుకుంటున్నామని, తాను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడినని, తిట్టడం మొదలుపెడితే ఉర్దూ, హిందీ, తెలు గు, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి తనకు కూడా ఉందని హెచ్చరించారు. మీకు కాదు, మీరు కూర్చున్న కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నామని తెలిపారు. మీ అదృ ష్టం బాగుండి ముఖ్యమంత్రి పదవి దక్కింది.. కానీ మీ తీరు చూస్తుంటే ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టు’ ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి పిచ్చి రోజురోజుకీ ముదురుతోందని, ఆయ న భార్య గీతమ్మ ఆయన్ని వెంటనే కట్టేయాలని, లేకపోతే ఎవరినైనా కరిచినా కరుస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ పేరు చెప్పుకోవడం గర్వకారణం...

‘నేను మా నాయన కేసీఆర్ పేరు చెప్పుకుని బతుకుతున్నా అంటావు.. అవును, మా నాయన తెలంగాణ తెచ్చిన మొనగాడు, గర్వంగా చెప్పుకుంటా. నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు నీ పేరు చెప్పుకుంటారు, కానీ ఇలాంటి లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు’ అని విమర్శించారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని కానీయను అని శపథాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతున్నానని.. మీకు సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చేయాలని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని కొడంగల్‌లో కూడా గెలవనీయకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. 

సమాధానం చెప్పలేకే బూతులు..

కేసీఆర్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే తెలివిలేకనే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘మొన్న కేసీఆర్ ఏమయ్యా.. పాల మూరు ప్రాజెక్ట్ ఎందుకు పండపెట్టినవు అని అడిగారు. ఎనిమిది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను వెనక్కి పంపినా, దానిని మళ్ళీ పంపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సోయి ఈ ముఖ్యమంత్రికి ఉం దా? 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే పాల మూరుకు నీళ్లు వస్తాయి, ఆ పని చేయమని అడగడం తప్పా?’ అని ప్రశ్నించారు.

దీనికి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి పిచ్చి మొరుగుడు మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా, కృష్ణా జలాల విష యంలో నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీస్తే.. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకుంటు న్నారని కేటీఆర్ ఆరోపించారు.

‘ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి? నెలకు రూ. 4000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు రూ. 2500 ఇస్తామని 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు ఏమయ్యాయి?, రెండేళ్లు దాటినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పా ల్సింది పోయి బూతులు తిట్టడం ఏంటని’ కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరుతో ఆడుతున్న డ్రామాలకు కేసీఆర్ బలమైన వాద నలతో అడ్డుపడుతుంటే, ప్రజలు ఎక్కడ తిరగబడతారో అన్న భయంతోనే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిట్లు తిడుతున్నారని స్పష్టం చేశారు.