7 March, 2026 | 1:45 AM

పనిచేయాలన్న తపన ఉంటే ప్రాంతం అడ్డుకాదు...

06-03-2026 01:38 PM

పోస్ట్ ఆఫీస్ ఢాక్ సేవక్‌గా రాణిస్తున్న రేవతి

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): పనిచేయాలన్న తపన, నిబద్ధత ఉంటే ప్రాంతం ఏదైనా రాణించవచ్చని యువతి రేవతి నిరూపిస్తోంది. పోస్టల్ శాఖలో ఢాక్ సేవక్‌గా విధులు నిర్వర్తిస్తూ తన కృషితో గుర్తింపు పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్ జిల్లా ఉరవకొండకు చెందిన రేవతి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని దాటి ఇతర ప్రాంతంలో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

వేతనం ఎంత అన్నది లెక్కచేయకుండా కష్టపడి పనిచేయాలన్న సంకల్పంతో ఆమె పోస్టల్ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను ప్రజలకు చేరవేస్తూ తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తోంది. నేటి యువత ఉద్యోగాల విషయంలో ప్రాంతం, పరిస్థితులు అనే భేదం లేకుండా కష్టపడి పనిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని రేవతి ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె వంటి యువత సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.