calender_icon.png 6 December, 2024 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి రవాణాలో రెవెన్యూ ఉద్యోగి

28-09-2024 01:16:57 AM

అరెస్టు చేసిన పోలీసులు

127కిలోల గంజాయి స్వాధీనం

మహబూబాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): గంజాయి రవాణ చేస్తున్న రెవె న్యూ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి, 127 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ వివరాలు వెల్లడించారు.

మరిపెడ ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గాలివారిగూడెం స్టేజ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమ ంలో కారులో తరలిస్తున్న 127 కిలోల ఎం డు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గం జాయి తరలిస్తున్న చత్తీస్‌గఢ్‌కు చెందిన రెవె న్యూ ఉద్యోగి సోడి నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

నిందితుల బైండోవర్

బెల్లంపల్లి, సెప్టెంబర్ 27: మంచిర్యాల జి ల్లా నెన్నెల మండలంలో గంజాయి కేసులో అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. వీరంతా సత్ప్రవర్తనతో మెదిలేందుకే బైండోవర్ చేసినట్లు చెప్పారు.