22 April, 2026 | 2:57 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

అమీన్‌పూర్‌లో రెవెన్యూ, హైడ్రా సర్వే

26-09-2024 12:22 AM

పటాన్‌చెరు, సెప్టెంబర్ 25: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాలసై కొరడా ఝుళిపించిన హైడ్రా అధికారులు బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 152, 153లో సర్వే చేపట్టారు.

ఓ నిర్మాణ సంస్థ వెంకటరమణకాలనీ హుడా లే ఔట్‌కు సంబంధించిన ప్లాట్లతో పాటు పార్కు స్థలాన్ని కబ్జా చేసి అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నదంటూ కాలనీవాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ సదరు స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం సర్వే జరుగుతోంది. నివేదిక తర్వాత ఇక కూల్చివేతలు ప్రారంభమవుతాయని తెలుస్తున్నది.