17 April, 2026 | 2:09 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలిన

09-02-2026 12:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న తీరును పర్యవేక్షించారు. బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్ పూర్తున తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణీందర్, మున్సిపల్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.