విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందజేత
10-06-2026 12:00 AM
జూబ్లీహిల్స్, జూన్ 9 (విజయక్రాంతి): తల్లిదండ్రులులేని ఓ నిరుపేద విద్యార్థిని చదువుకు నవ యువ నిర్మాణ్ స్వచ్ఛంధ సేవా సంస్థ ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచింది. సంస్థ డైరెక్టర్ వల్లాల ప్రవీణ్ కుమార్ (వెంకట్) యాదవ్ షేక్ పేట డివిజన్ కు చెందిన విద్యార్థిని చరితకు సంస్థ తరపున రూ.30వేల ఆర్థిక సాయం మంగళవారం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వచ్ఛంధ సేవా సంస్థను స్థాపించారన్నారు. విద్యార్థిని ఉన్నత చదువుకోసం ఆర్థిక సాయం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఆమె ఫీజు బాధ్యతను కూడా భరిస్తామన్నారు. ఒక సోదరుడిగా అండగా నిలబడతామని ప్రకటించారు. విద్యా ద్వారా జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.






