03-12-2025 12:51:12 AM
రెవిన్యూ శాఖ మంత్రికి వినతిపత్రం అందచేసిన ఐ.యన్.టీ. యూ.సీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2, (విజయక్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచలో ఖాయిల పడిన పరిశ్రమను పునరుద్ధరించి లోకల్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఐ. యన్. టీ. యూ. సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలీల్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు బానోత్ బాలు నాయక్ వినతిపత్రం అందచేసారు.
మంగళవారం పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యానివర్శిటి ఓపెనింగ్ విచ్చేసిన మంత్రికి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లకు మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమం లో నాయకులు రవి నాయక్, సక్రం నాయక్ లు పాల్గొన్నారు