calender_icon.png 3 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైషమ్యాలు వద్దు

03-12-2025 12:50:16 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, డిసెం బర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ బేషరత్‌గా క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలు గు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని, పవన్ చేసిన వ్యాఖ్యలతో వైషమ్యా లకు దారితీసే పరిస్థితి ఉందన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. 

డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోవద్దు: కాంగ్రెస్ ఎంపీ

చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిర ణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ‘మీరు గెలిచిన తర్వాత కోనసీమకు దిష్టితగిలినట్లుంది. అక్కడనున్న సమస్యలపైన మాట్లాడండి. ఇష్టమున్నట్లుగా తెలంగాణపై మాట్లాడటం సరికాదు ’ అని ఎంపీ చామల హితవు పలికారు. 

బలుపు మాటలు ఎందుకు?:

ఎమ్మెల్సీ బల్మూరి ఆగ్రహం 

పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని, ఇక్కడి నుంచి పరిగెత్తించి తరిమి కొడుతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని హితవు పలికారు. డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

పవన్‌వి తలితిక్క మాటలు 

మంత్రి వాకిటి శ్రీహరి 

తెలంగాణపై పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విధ్వేశం పెంచే మాటలు సరికాదని, పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగావని, మైలేజ్ పొందాలంటే పనితనం చూపించుకోవాలన్నారు.