19-02-2026 01:07:36 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో దీనిని ప్రోత్సాహిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ 30లక్షలకు పైగా పంప్‌సెట్లు, దాదా పు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈ శక్తిని బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నా మని, హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా తాము కార్బన్ ఫుట్ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియ న్(క్యూర్)లో దాదాపు పరిశ్రమలు ఉండవని సీఎం స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో దేశంలోని పట్టణాలు, నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై తెలంగాణ దక్పథాన్ని సీఎం వివరించారు.
‘2047 లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలంటే 1947 నుంచి భారత అభివృద్ధి ప్రయాణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్వాతం త్య్రం అనంతరం తొలి నాలుగు దశాబ్దాల్లో దేశంలో ప్రధాన ప్రాధాన్యతలు విద్యా వ్యవస్థ, నీటిపారుదల రంగాలే. గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నుంచి ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌సీవంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్, సాగునీటికి భారీ ఆనకట్టలను నిర్మించి రైతుల పొలాలను నీటితో అనుసంధానించాం.
1990 నాటికి భారత్ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిం ది. దీంతో ప్రజల జీవితకాలం పెరిగింది. దేశంలోని ఇంజినీర్లు, వైద్యులు, శావేత్తలు ప్రపం చవ్యాప్తంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి సాధించింది. 1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్, ప్రయివేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్‌పీజీ) సంస్కరణలతో భార త్ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగింది. టెలికాం , సాఫ్ట్ వేర్ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమైంది.
భారత నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రపంచ కేంద్రాల్లో విజయాలు సాధించారు. 1991 తర్వాత గ్లోబల్ సాఫ్ట్ వేర్, టెక్ సంస్థలు తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకున్నాయి. అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీఎస్) మన దేశంలో ఉన్నాయి. అయితే, ఈ టెక్ పురోగతిలో తయారీ రంగం ఎక్కువగా అవకాశాలు కోల్పోయింది. కోవిడ్ అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారింది.
ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారా యి. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుంది ’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజించాం.
హైదరాబాద్‌ను 160 కి.మీ. పొడవైన ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)గా ప్రకటించగా, ఓఆర్‌ఆర్ 360 కి.మీ. ల రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ప్రాంతాన్ని ప్యూర్ జోన్లుగా రూపొందించి తయారీ రంగానికి నిర్దేశించాం. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివద్ధి చేసి “చైనా ప్లస్ 1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం. ఈ తయారీ వద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
రాష్ర్టం రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తోందని సీఎం రేవం త్‌రెడ్డి గణాంకాలను వెల్లడించారు. గత ఏడాది గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు నమోదైందని, ఈ ఏడాది అది 19వేల మెగావాట్లను దాటుతుందని అంచనాలున్నాయని వివరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో 24.8 శాతం లేదా 25 శాతం గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని తెలిపారు.
360కి.మీ రీజినల్ రింగ్‌రోడ్ నిర్మా ణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నా యన్నారు. ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని ప్రధాన తయారీ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు, ము ఖ్యంగా డేటా సెంటర్లు, పరి శ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని తెలిపారు. తెలంగా ణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమం లో వనరుల పెరుగుదలలో ప్రధాన భాగం గ్రీన్‌గా ఉండాలనేదే సంకల్పమని సీఎం తెలిపారు.
పర్యావరణ రక్షణకు హైడ్రా
హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా ఈవీల స్వీకరణ పెరిగిందని సీఎం తెలిపారు. తెలంగాణలోనే ఈవీల తయారీ కోసం సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజా రవాణా వ్యవ స్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తుండగా, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని చెప్పారు.
హైద రాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ. నుంచి 200 కి.మీ.పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని సీఎం వివరించారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీ నది పునరుద్ధరణ, సరస్సులు, చెరువు ల సంరక్షణ, వాటర్ గ్రిడ్, వనరుల నిర్వహణ ప్రణాళికలను సీఎం వివరించారు.
హైడ్రా రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీ సు దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణ ప్రమాదాలను తగ్గించి నగరాన్ని సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందే నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.