calender_icon.png 16 October, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తాం

16-10-2025 02:10:34 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): టిఆర్‌ఎస్ 10 సంవత్సరాల పాలనలో అక్రమ కేసులను ఎదుర్కొని నానా ఇబ్బందులకు గురై అన్ని విధాలుగా నష్టపోయి పార్టీనీ కాపాడిన కార్యకర్తలను గుర్తించి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని రాష్ర్ట రోడ్ల భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

బుధవారం నాడు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి తల్లి గారి దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా  భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డులోని ప్రవేట్ హోటల్ వద్ద పట్టణ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

జరిగే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుపొంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పలు సమస్యలపై కార్యకర్తలు మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.  సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు ఈ సమయాన్ని తన ఇంటికి రావచ్చు అని మీ కోసం మా ఇంటి డోర్లు ఎల్లప్పుడూ తెరిసి ఉంటాయన్నారు.

మంత్రి వెంట ఆలేరు ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పోతాంశెట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు పడిగెల ప్రదీప్, ఈరపాక నరసింహ, పిట్టల బాలరాజ్, ఇలియాస్, దాసరి మధు,

దేవరకొండ నరసింహ చారి, మజర్, శిగ, నరేష్ గౌడ్ ,జువ్వగాని శ్రీధర్, బింగి నరేష్, దేవరకొండ నరసింహ చారి, చందుపట్ల గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్, శ్రవణ్ రెడ్డి, బర్రె నరేష్ ,పొట్ట శివ, సాల్వేరు ఉపేందర్ ,కాకునూరి మహేందర్, పిట్టల బాలరాజ్ ,మంచుకంటి కృష్ణమూర్తి, పల్లెర యాదగిరి, మహేందర్ ,ప్రభాకర్ ,సాయి నరేందర్ ఉన్నారు.