16 May, 2026 | 2:10 AM

లారీలు అన్‌లోడ్ చేయడంలో రైస్‌మిల్లర్లు జాప్యం చేయొద్దు

16-05-2026 12:00 AM

తూప్రాన్, మే 15:  మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడ్ చేయడంలో జాప్యం చూపిస్తున్నారని ఇందుకు కొత్త కొత్త నిబంధనలను పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండల పరిధిలోని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతంతో పాటు బియ్యం రికవరీ, తక్కువగా వస్తుందంటూ విచ్చలవిడిగా కోతలు విధిస్తున్నారు, తాలు, పొల్లు పేర్లతో క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున అదనంగా ధాన్యమును వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఐకెపి సెంటర్ల ద్వారా లోడ్ అయ్యి మిల్లుల వద్దకు వెళ్లినప్పుడు అన్లోడ్ చేసే విషయంలో రోజుల తరబడి జాప్యం చేయడం జరుగుతుందని తూప్రాన్ మండల అధికారి చంద్రశేఖర్ రెడ్డి రైస్ మిల్లులను సందర్శించారు. అన్లోడింగ్ విషయంలో మిల్లర్ల యాజమాన్యాలు జాప్యం చేయరాదని హెచ్చరించారు.