17 July, 2026 | 8:56 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు

16-05-2026 12:00 AM

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

అమీన్పూర్, మే 15 : నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గల లేక్ వ్యూ కాలనీలో శుక్రవారం రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో నూతన బోర్లు, ట్యాంకర్లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ, జలమండలి జిఎం శ్రీనివాస్ రెడ్డి, డిజిఎం శివ, ఇంజనీరింగ్ డిఈ వెంకటరమణ, కాలనీ అధ్యక్షుడు విజయ్, తదితరులు పాల్గొన్నారు.