calender_icon.png 12 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులు

12-11-2025 08:26:22 PM

యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి..

ధాన్యం కాంట వేసేటప్పుడు తరుగు తీసే పేరుతో రైతులను దోపిడీ చేయొద్దు..

హనుమకొండ (విజయక్రాంతి): జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమయ్యారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యల్ని పరిష్కరించడం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం డిమాండ్లపై బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న భిక్షపతి మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా జిల్లాలో రైస్ మిల్లులు రైతులను తరుగు, తాలు, రవాణా పేరుతో ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని, ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం వహించడమో లేదా సహకరించడమో చేయకపోతే ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. తరుగు రూపంలోనే రైతులకు కోట్లల్లో నష్టం వాటిల్లుతుందని, దీనికి కారణం రైస్ మిల్లులు మాత్రమే కాదని అధికారులు కూడా కారణం అన్నారు. సంవత్సర కాలం నుంచి సీఎంఆర్ పెట్టకుండా అట్టి ధాన్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రజలు, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, మిల్లర్ల కోసమా అని మండిపడ్డారు. మొత్తం జిల్లాలోని రైస్ మిల్లుల ను నెలకోసారి పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.

అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని,తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని , రైతులకు గన్నీ బ్యాగులను అవసరం మేరకు అందించాలని , సరిపడా లారీ లను ఏర్పాటు చేసి రవాణా సమస్యలు రాకుండా చూడాలని, ముంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని నాణ్యత పేరుతో కొనుగోళ్లు ఆపవద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్ , సిరబోయిన కరుణాకర్, జిల్లా నాయకులు మద్దెల ఎల్లేశ్ , ఎదునూరి వెంకటరాజం, నేదునూరి రాజమొగిలి, కర్రె లక్ష్మణ్, కొట్టేపాక రవి, మునిగాల భిక్షపతి, జక్కు రాజు గౌడ్,ఈషబోయిన శ్రీనివాస్ ,అలువాల రాజు, రాజేందర్, దొమ్మటి ప్రవీణ్, జూకంటి పద్మ, కొట్టె వెంకటేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.